బహుభాషా చిత్రంగా 'మామ్'
- May 10, 2017
అతిలోక సుందరి గా యూవత్ సినీ ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి , పెళ్లి చేసుకున్న తర్వాత వెండి తెర కు దూరమయ్యింది. 2012 లో 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ ప్రేక్షకులను అలరించింది..తాజాగా తన భర్త బోనీకపూర్ నిర్మాణం లో 'మామ్' చిత్రం తో త్వరలో రాబోతుంది. మొదటగా ఈ చిత్రాన్ని హిందీ లో మాత్రమే రిలీజ్ చేయాలనీ అనుకున్నప్పటికీ , టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
మూడు భాషలతో పాటు మలయాళ భాషలో కూడా డబ్ చేయాలని నిర్ణయించారట. దీంతో మొత్తం నాలుగు భాషల్లో జూలై 7వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు రవి ఉద్యావర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధికి, అక్షయ్ ఖన్నా, అభిమన్యు సింగ్ లు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







