అభిమానులను కలవనున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్
- May 10, 2017
తన అభిమానులతో సమావేశం కావాలని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు నిర్ణయించినట్లు ఆయన సన్నిహితుడు ఒకరు బుధవారమిక్కడ తెలిపారు. ఈ నెల 15 నుంచి 19 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ఇందులో అభిమానులను బృందాలవారీగా రజనీకాంత్ కలుస్తారని ఆయన చెప్పారు. అభిమాన సంఘాలతో రజనీ భేటీపై కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్‌స్టార్ సన్నిహితుడి నుంచి సమావేశం తేదీలు వెలువడటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత నెల కూడా కోడంబాక్కంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమానులతో తలైవా భేటీ అవుతారని ప్రచారం సాగినా చివరకు వాయిదా పడింది. 2009లో శివాజీ సినిమా విజయవంతమైన సందర్భంగా అభిమానులతో రజనీకాంత్ ఫొటోలు దిగే కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







