నేడు శ్రీలంకకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ
- May 10, 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం శ్రీలంకకు బయలుదేరనున్నారు. బౌద్ధులు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వేసక్ (సింహళీయుల బుద్ధ పూర్ణిమ) ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. శుక్ర, శనివారాల్లో నిర్వహించే ఈ వేడుకలకు వంద దేశాల నుంచి 400 మంది వరకు ప్రతినిధులు హాజరవుతారు. బౌద్ధుల కాలమాని(కేలండర్) ప్రకారం వేసక్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. బుద్ధుని పుట్టుక, జ్ఞానోదయం, నిర్వాణాలకు సంబంధించిన అంశాలను స్మరించుకుంటూ ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను చేపడతారు. మోదీ తన పర్యటన సందర్భంగా శ్రీలంక నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉందని విదేశీ వ్యవహారాల (హిందూ మహాసముద్ర ప్రాంత) సంయుక్త కార్యదర్శి సంజయ్ పాండా తెలిపారు. అయితే, ఇవి సాధారణ భేటీలేనని స్పష్టం చేశారు. ఈ పర్యటన సందర్భంగానే శ్రీలంకలోని తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన కేండీ ప్రాంతాన్ని మోదీ సందర్శించనున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







