హైదరాబాద్ లో 24 గంటల ఇన్వెస్కో ఇన్నోవేషన్ హబ్
- May 10, 2017
వివిధ దేశాల్లో ఇన్వెస్ట్ మెంట్ సేవలందిస్తున్న ఫైనాన్షియల్ దిగ్గజం ఇన్వెస్కో... టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు హైదరాబాద్‌లో తమ తొలి గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌ను ఆరంభించింది. ఫైనాన్షియల్ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఉద్యోగులు, స్టార్టప్‌ల వినూత్న ఐడియాలను ప్రోత్సహించేందుకు ఈ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు సంస్థ సీటీవో డోనీ లోచన్ తెలిపారు.
మంగళవారం దీన్ని ఆరంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘హబ్ ఆరంభం సందర్భంగా 24 గంటల పాటు అంతర్గతంగా మా ఉద్యోగుల కోసం హ్యాకథాన్ నిర్వహిస్తున్నాం. దీన్లో సుమారు 600 మంది పాల్గొంటున్నారు’’ అని తెలిపారు. ప్రస్తుతం ఇన్వెస్కో దాదాపు 835 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తోందని, 6 వేల మంది పైచిలుకు ఉద్యోగులున్నారని సంస్థ గ్లోబల్ హెడ్ (స్ట్రాటెజీ ఇన్నోవేషన్ అండ్ ప్లానింగ్ విభాగం) డేవ్ డోసెట్ వివరించారు. భారత్‌లో 1100 మంది దాకా సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







