లిబియాలోని ఐఎస్ ఉగ్రవాదులకు ఇండియా నుంచి డ్రగ్స్
- May 10, 2017
-3.7 కోట్ల మాత్రలను పట్టుకున్న ఇటలీ అధికారులు
-పంజాబ్‌లోని రాయల్ ఇంటర్నేషనల్ ఫార్మసీలో తయారు
లిబియాలోని ఐఎస్ ఉగ్రవాదులకు అమ్మేందుకు ఉద్దేశించిన నల్లమందు తరహా ట్రామడోల్ మాత్రలను తరలిస్తున్న నౌకను ఇటలీ అధికారులు పట్టుకున్నారు. ఉగ్రవాదులకు పట్టుదల, ఓపికను పెంచేందుకు వీటిని సమకూరుస్తారు. మాదకద్రవ్యం కొకైన్కు చవకరకం ప్రత్యామ్నాయంగా కూడా వీటికి గుర్తింపు ఉంది. పశిమాసియా 7.5 కోట్ల అమెరికా డాలర్ల విలువ చేసే (భారతీయ కరెన్సీలో రూ.510 కోట్లు) 3.7 కోట్ల ట్రామడోల్ మాత్రలు నౌకలో ఉన్నట్టు గుర్తించారు. గెనోవాలో మూడు కంటేనర్లలో మాత్రలను ప్యాక్ చేసి.. పైన బ్లాంకెట్లు, షాంపూ అని లేబుల్ అంటించారు. లిబియాలోని మిస్రాతా, టోబ్రుక్ వెళ్లే సరకుల ఓడల్లోకి ఎక్కిస్తుండగా అధికారులు అనుమానం వచ్చి పట్టుకున్నారని లండన్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. నొప్పి నివారణకు ఉపయోగించే ట్రామడోల్ మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించే డ్రగ్‌గా కూడా పనిచేస్తుంది. ఉగ్రవాదులకు ఉత్తేజం కలిగించి పోరాటానికి ఉసిగొల్పే లక్షణాలు దీనికి ఉంటాయని బీబీసీ పేర్కొన్నది. మాత్రలను అధికరేటుకు అమ్మి డబ్బు సంపాదించేందుకు లేదా నేరుగా ఉగ్రవాదులకు సరఫరా చేసేందుకు ఈ సరుకును ఉద్దేశించి ఉంటారని ఇటాలియన్ పోలీసులు అంటున్నారు.
నైజీరియాలో బోకోహరామ్ ఉగ్రవాదులు చిన్నారులకు కర్జూరంలో ట్రామడోల్ మాత్రలను నింపి తినిపించి తుపాకులిచ్చి దాడులకు పంపుతారు. ఉగ్రవాదుల ఆకలి, అలసట, భయం పోగొట్టేందుకు ఐఎస్ కాప్టగాన్ మాత్రలను ఎప్పటినుంచో ఉపయోగిస్తుంది. జెనోవాలో పట్టుబడ్డ మాత్రలు ఇండియా నుంచి వచ్చినట్టు ఇటాలియన్ అధికారులు నిర్ధారించారు. రాయల్ ఇంటర్నేషనల్ అనే భారతీయ కంపెనీ వాటిని తయారు చేసినట్టు చెప్తున్నారు. పంజాబ్‌కు చెందిన ఆ కంపెనీ ఇటలీలో డ్రగ్స్ పట్టివేతపై వ్యాఖ్యానించేందుకు నిరాకరిస్తున్నది. దుబాయ్‌లోని దిగుమతిదారుకు సంస్థ 2.5లక్షల డాలర్లకు ట్రామడోల్ మాత్రలను విక్రయించింది. భారత్ నుంచి శ్రీలంకకు వెళ్లిన తర్వాత సరుకు జాడ తెలియకుండా పోయింది. ట్రామడోల్ మాత్ర లిబియాలో 2 డాలర్లకు అమ్ముడవుతుందని ఇటాలియన్ దర్యాప్తు అధికారి తెలిపారు. గత ఏడాది గ్రీకు రేవుపట్టణం పైరేయస్లో 2.6కోట్ల ట్రామడోల్ మాత్రలు పట్టుబడ్డాయి. అవీ భారత్‌లో తయారైనవే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







