అజిత్ 'వివేగమ్' సినిమా ట్రైలర్ సూపర్
- May 11, 2017
అజిత్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న 'వివేగమ్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాటగా అఫీషియల్ ట్రైలర్ రిలీజైంది.
శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అజిత్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఇందులో అజిత్ ఇంటర్‌పోల్ అధికారిగా నటిస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో వాడిన టెక్నాలజీ హాలీవుడ్ రేంజిలో ఉందని స్పష్టమవుతోంది.
సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.
అజిత్- శివ కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన వేదాలం, వీరమ్ చిత్రాలు తమిళనాడులో భారీగా విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో 'వివేగమ్' పై అంచనాలు మరింత పెరిగాయి. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







