డ్రైవర్ మూర్ఛపోతే.... స్టీరింగ్ ను అందుకొని బస్సుని నడిపిన కాలేజ్ అమ్మాయి
- May 11, 2017
సకాలంలో ఆ కాలేజీ అమ్మాయి స్పందించడంతో... ఒక పెద్ద ముప్పు తప్పింది. మంగళవారం హెయిల్ యూనివర్శిటీ అల్-ఘజ్జలా శాఖకు చెందిన బస్సుని డ్రైవర్ నడుపుతూ, ఒక్కసారిగా మూర్ఛ వ్యాధికి గురై స్టీరింగ్ మీద అకస్మాత్తుగా పడిపోయాడు బస్సు కుదుపులకు లోనవుతూ దిగువకుపోతూ ఓ పక్కకు వెళ్ళిపోతుంది ..ఆ క్షణాన ఆ బస్సులో ఉన్న కాలేజీ యువతీలలో ఒక అమ్మాయి వెంటనే డ్రైవర్ వద్దకు పరుగున రావడం వెనువెంటనే స్టీరింగ్ ను చేతబుచ్చుకొని చాకచక్యంగా తిరిగి బస్సుని రోడ్డుపై సమర్ధవంతంగా నడిపి భారీ ప్రమాదం నుంచి అందర్నీ కాపాడింది. తన చర్యతో అందర్నీఆశ్చర్యానికి గురిచేసింది.సాహసోపేతమైన ఆ పనితో బస్సులో తన తోటి యువతులను కాపాడిన ఆమె సమయస్ఫూర్తిని అందరూ కొనియాడుతున్నారు. కళాశాల బాలికలతో ఒకరైన అష్వాఖ్ అల్-షామిరి, అంతటితో ఆగక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ డ్రైవర్ ను తీసుకొని నేరుగా సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారని అన్న ఆన్లైన్ వార్తాపత్రికలో ఒక నివేదికలో తెలిపింది. ప్రైవేటు బస్సులో తరగతులకు వెళ్లిన తర్వాత ఆ అమ్మాయిలు తిరిగి తన ఇంటికి వెళ్లిపోయారు.యూనివర్సిటీ బ్రాంచ్ లోని బాలికల విభాగం సాధారణ పర్యవేక్షకుడు డా. హానన్ అల్-అమీర్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, డ్రైవర్ యొక్క జీవితాన్ని కాపాడటానికి ఆ విద్యార్థిని చేసిన సాహిస చర్య ఎంతగానో సహాయపడిందని, ఆమె ధైర్యం మరియు మానవతావాద స్ఫూర్తిని ఆయన మెచ్చుకున్నాడు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







