అద్భుతం: ట్రాఫిక్ నుంచి బయటపడ్డ కేరళ వ్యక్తి
- May 12, 2017
షార్జా ఎయిర్‌పోర్ట్ నుంచి కేరళకు వెళ్ళాల్సిన సానిల్ మాథ్యూ అనే వ్యక్తి, సమయానికే ఎయిర్‌పోర్ట్‌కి చేరుకునేందుకు ప్రణాళిక రచించుకున్నా, అనుకోని విధంగా ట్రాఫిక్ ఆయన ప్రయాణాన్ని 'థ్రిల్లింగ్'గా మార్చేసింది. ఓ దశలో, ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడం అసాధ్యమనుకున్నారు సానిల్ మాథ్యూ. అయితే ఎవరూ ఊహించని విధంగా యూఏఈ పోలీసుల సానిల్‌కి సహాయ సహకారాలు అందించారు. స్నేహితుడి సూచన మేరకు 999 ఫోన్ నెంబర్‌ని కాంటాక్ట్ చేసి, తాను ట్రాఫిక్‌లో ఉన్న విషయాన్ని సానిల్ వెల్లడించడం జరిగింది. అంతే 15 నిమిషాల్లోనే సానిల్ మాథ్యూ వద్దకు యూఏఈ పోలీసులు చేరుకున్నారు. సానిల్ వద్దనున్న ట్రావెల్ డాక్యుమెంట్స్ పరిశీలించి, తమతోపాటు సానిల్‌ని ఎయిర్‌పోర్ట్ వద్దకు తీసుకెళ్ళారు. అప్పటికే, చెక్ ఇన్ కౌంటర్ క్లోజ్ అయిపోయింది. అయితే, ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న సానిల్‌కి అక్కడా పోలీసులు సహాయం అందించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ని ఓ అద్భుతంగా సానిల్ అభివర్ణించారు. యూఏఈ పోలీసులు తనకు అందించిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారాయన. అయితే తమ డ్యూటీ తాము నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







