జీసీసీ రైల్వే ప్రాజెక్ట్ పూర్తయ్యేదెప్పుడు?
- October 06, 2015
ఆరు గల్ఫ్ దేశాల్ని కలిపే జీసీసీ రైల్ నెట్వర్క్ 2018 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో కాస్త ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 15న ఆరు జీసీసీ దేశాల ప్రతినిథులు సమావేశమై ప్రాజెక్ట్ పరిస్థితిని సమీక్షించనున్నారు. 2,100 కిలోమీటర్ల మేర జీసీసీ రైల్వే విస్తరించనుంది. యూఏఈ 40 బిలియన్ దిర్హామ్‌లతో ఎతిహాద్ రైల్ ప్రాజెక్ట్‌ని చేపట్టింది. ఇది జీసీసీ రైల్వేతో కనెక్ట్ కానుంది. 1,200 కిలోమీటర్ల లైన్ 2018లో పూర్తి కావాల్సి ఉంది. ఇది ప్రధాన పారిశ్రామిక జోన్లను, పట్టణాలను, పోర్టులను అనుసంధానం చేయనుంది. పబ్లిక్ వర్క్స్ మంత్రి అల్ నౌమి మాట్లాడుతూ ఒమన్ బోర్డర్ నుంచి సౌదీ బోర్డర్ వరకూ ఉన్న 1,200 కిలోమీటర్ల ప్రాజెక్టులో 264 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయ్యిందని చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







