ఒమాన్ లో డ్రెస్‌ కోడ్‌ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి

- October 06, 2015 , by Maagulf
ఒమాన్ లో డ్రెస్‌ కోడ్‌ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి

పబ్లిక్‌ ప్లేసెస్‌లో డ్రెస్‌ కోడ్‌కి సంబంధించిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. పురుషులు, స్త్రీలు డ్రెస్‌ కోడ్‌ విషయంలో ఒమన్‌ సంప్రదాయాల్ని గౌరవించాల్సి ఉంటుంది. అయితే సోషల్‌ మీడియాలో ఈ డ్రెస్‌ కోడ్‌ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వ్యక్తిని సిటీ సెంటర్‌ మస్కట్‌లో సెక్యూరిటీ సిబ్బంది షార్ట్స్‌ వేసుకున్నాడన్న కారణంగా అడ్డుకోవడం వివాదాస్పదమయ్యింది. తనలా చాలామంది షార్ట్స్‌ ధరించి మాల్‌లో తిరుగుతున్నారనీ, తనను మాత్రమే అడ్డగించడమేంటని ఆ వ్యక్తి ప్రశ్నించగా, మాల్‌ నిర్వాహకులు, జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పారు. డ్రెస్‌ కోడ్‌కి సంబంధించి విస్తృత ప్రచారం జరగవలసి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒమన్‌లో కార్మికులు, ఉద్యోగులు, పౌరులు డ్రెస్‌ కోడ్‌ పాటించాలనీ, అసభ్యకరమైన వస్త్రధారణ తగదని ఎప్పటినుంచో చర్చ జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనే భావన ఉన్నప్పటికీ, కొన్ని కారణాలతో నిబంధన రూపం దాల్చలేదు. 

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com