షార్జా అగ్ని ప్రమాదంలో కార్మికుడి మృతి
- May 13, 2017
షార్జా హమ్రియా పోర్ట్‌లో తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఓ షిప్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెస్క్యూ టీమ్స్ వెంటనే స్పందించి, బాధితులకు తగిన సహాయాన్ని అందించాయి. అలాగే మంటల్ని ఆర్పివేశాయి. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న మూడు నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న ఫైర్ ఫైటర్స్ 40 నిమిషాలు అగ్ని కీలలతో పోరాడి, వాటిని అదుపు చేశారు. ప్రమాదం జరిగిన షిప్, డీజిల్ మరియు ఆయిల్ ప్రోడక్ట్స్‌ని కలిగి ఉంది. అగ్ని కీలలు పోర్ట్‌లోని ఇతర షిప్‌లకు వ్యాపించకుండా సకాలంలో ఫైర్ ఫైటర్స్ చాకచక్యంగా వ్యవహరించారని షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ సమి అల్ నక్బి చెప్పారు. అజ్మన్, ఉమ్ అలఠ్ కువైన్ నుంచి కూడా సివిల్ డిఫెన్స్ టీమ్స్ ఈ ఘటనలో తమ సహాయ సహకారాల్ని అందించాయి. గాయపడ్డ కార్మికుల్ని కువైట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి నిలకడగానే ఉంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







