కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగు దేశం-- కువైట్ వారి ఆధ్వర్యంలో మిని మహానాడు
- May 13, 2017
కువైట్ లో మే 19న ప్రవాసాంద్ర తెలుగు దేశం కువైట్ వారి ఆధ్వర్యంలో మిని మహానాడు.... అందరూ ఆహ్వానితులే
కువైట్ లో మే 19 వ తేదీన ప్రవాసాంద్ర తెలుగు దేశం కువైట్ వారి ఆధ్వర్యంలో మిని మహానాడు బహిరంగ సభ జరుగుతుందని, కువైట్ లో ఉన్న దాదాపు 2 లక్షల మంది తెలుగు వారిలో ఎక్కువమంది టీడీపీ అభిమానులేనని అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టామని తెలియజేశారు.
ప్రవాసాంద్ర తెలుగు దేశం కువైట్ వారు నిర్వహించు మినీ మహానాడుకు విచ్చేయుచున్న అతిరధ మహారధులు కోల్లు రవీంద్ర ఎన్.ఆర్.ఐ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ,శ్రీ గరికపాటి మోహనరావు ఎం.పి తెలంగాణ, శ్రీ ఎల్ రమణ తెలంగాణా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు,శ్రీ షరీఫ్ మహమ్మద్ అహ్మాద్ ఎం.ఎల్.సి, శ్రీ బి.టెక్ రవి కడప ఎం.ఎల్.సి, శ్రీ బి.చెంగల రాయలు మాజీ ఎం.ఎల్.సి రైల్వే కోడూరు ,శ్రీ డి.చమన్ సాబ్ జెడ్పి చైర్మన్ అనంతపురం,శ్రీ కొమటి జయరాం మాజీ తానా ప్రెసిడెంట్ అమెరికా తదితరులు ఈ కార్యక్రమమునకు విచ్చేయుచున్నారు.
మిని మహానాడు మే 19 న బాయ్స్ స్కాట్ హాల్,హవెల్లి (టెలిఫోన్ ఎక్స్చేంజ్) ప్రక్కన, బైరూత్ స్ట్రీట్ - హవెల్లి సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభం. ప్రతి ఒక్కరికి ఎంట్రన్స్ ఫ్రీ. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.
మిని మహానాడు కు సంబందించిన సమాచారము కొరకు ఈ క్రింది నెంబర్ లను సంప్రదించగలరు.
55562769,97286038,50679445
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







