నిఖిల్ కేశవ ట్రైలర్
- May 13, 2017
తెలుగు యువ హీరోల్లో నిఖిల్‌ది ఓ ప్రత్యేక స్థానం. కథల ఎంపికలో నిఖిల్ చూపించే చొరవ అభినందనీయం. రొటీన్ సినిమాలతో విసిగిపోయిన సినీ జనాలకు నిఖిల్ సినిమాలు కొత్తదనాన్ని పంచుతాయడనడంలో సందేహం లేదు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికిపోతావు చిన్నవాడా ఇలా ప్రతీ సినిమా కథ దేనికదే విభిన్నం. ఇప్పుడు అలాంటి ఓ సరికొత్త కథాంశంతో నిఖిల్ హీరోగా రూపొందిన సినిమా కేశవ. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అందరికీ ఎడమ వైపు ఉండే గుండె కుడి వైపు ఉంటే కలిగే భావోద్వేగాలు, ఆ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు సుధీర్ వర్మ. పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







