ఉత్తరకొరియా సరిహద్దుల్లో మరో క్షిపణి ప్రయోగం
- May 13, 2017
కొరియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. నేడు ఉత్తరకొరియా మరోసారి ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. దక్షిణకొరియా అధ్యక్షుడిగా మూన్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ పరీక్షను నిర్వహించడం గమనార్హం. కుసాంగ్ సమీపంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించారు. కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్షిపణి జపాన్ సముద్రజలాల్లో కూలిపోవటం గమనార్హం. గత నెలలో నిర్వహించిన రెండు క్షిపణి పరీక్షలు విఫలం కావడంతో నేటి పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది ఏ రకం క్షిపణో తెలియాల్సి ఉంది. దీనిపై జపాన్ రక్షణ మంత్రి స్పందిస్తూ.. ఉత్తరకొరియా తూర్పుతీరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ క్షిపణి కూలిపోయిందని తెలిపారు. ఇది కొత్త శ్రేణికి చెందిన క్షిపణి అని ఆయన తెలిపారు.
దక్షిణకొరియా నూతన అధ్యక్షుడిపై ఒత్తిడి పెంచేందుకే ఈ చర్య తీసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మూన్ ఎన్నికల్లో ఉత్తరకొరియాతో సత్సంబంధాలు పెంచుకుంటానని ప్రచారం చేశారు. నేటి పరీక్షను ఆయన ఖండించారు. ఇదో రెచ్చగొట్టే చర్య అని అభివర్ణించారు. ఉత్తర కొరియాతో చర్చలు చేపట్టాలంటే దాని వైఖరిలో కచ్చితంగా మార్పు రావాలని ఆయన అన్నారు.
ఉత్తరకొరియా క్షిపణి పరీక్షను అమెరికా పశ్చిమ కమాండ్ తేలిగ్గా కొట్టిపారేసింది. ఈ క్షిపణికి అమెరికాను భూభాగాన్ని తాకేంత శక్తిలేదని పేర్కొంది. మరో పక్క ఉత్తరకొరియా మిత్ర దేశమైన చైనా ఈ పరీక్షపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







