కేశవ ట్రైలర్ నచ్చడం కాదు అదిరిపోయిందన్న భల్లాలదేవ
- May 15, 2017
బాహుబలి మేనియా నుంచి సినీ జనాలు ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నారు. శుక్రవారం విడుదలైన రాధ, వెంకటాపురం సినిమాలు కాసింత వినోదాన్ని పంచినా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయాయి. దీంతో వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న నిఖిల్ సినిమా కేశవ కోసం సినీ జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందనే వస్తోంది. టాలీవుడ్ ప్రముఖులు చాలామంది ట్రైలర్ చూసి బాగుందని నిఖిల్‌కు కితాబిచ్చారు. ఇలా వైవిధ్యభరితమైన కథాంశాలు ఎంచుకుంటున్నందుకు నిఖిల్‌ను అభినందించారు. అయితే అందరి అభినందన కంటే భల్లాలదేవుడి ఫీడ్‌బ్యాక్ నిఖిల్‌కు కొండంత బలాన్ని ఇస్తుందనే చెప్పాలి. అందరూ కేశవ ట్రైలర్ నచ్చిందని చెబితే... రానా మాత్రం నచ్చడం కాదు అదిరిపోయిందంటూ ట్వీట్ చేశాడు. దేశమంతా పొగడ్తలతో ముంచెత్తుతున్న బాహుబలి సినిమాలోని స్టార్ తమ సినిమా ట్రైలర్ చూసి ఇలాంటి స్పందన ఇవ్వడంతో చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. రానాతో పాటు మరో యువ హీరో నితిన్ కూడా ట్రైలర్ చాలా బాగుందని ట్వీట్ చేశాడు. సాయి ధరమ్ తేజ్, సచిన్ జోషి, వరుణ్ సందేశ్, అల్లరి నరేష్ కేశవ ట్రైలర్ బాగుందని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







