RGV కి కాలం కలసి రావటం లేదు
- May 15, 2017
సంచలన దర్శకుడు.. వివాదల వర్మ ... సునీల్ హీరోగా తెరకెక్కించిన అప్పల్రాజు సినిమాలో లక్కుతో శివ సినిమా తీసి షోలేని చెడగొట్టి పిచ్చి వాగుడు వాగేవాడు..హిచ్చికాకు సినిమాలు చూసి దెయ్యాల సినిమాలు తీసే రాంగోపాల్ వర్మ డైరెక్టరా ఖర్మ అని తనమీద తానే సెటైర్ వేసుకొన్నాడు.. కాగా శివ, రంగీల సినిమాల తర్వాత వర్మ టాలెంట్ ని ప్రూవ్ చేసే సినిమా ఒక్కటి కూడా వర్మ స్కూల్ నుంచి రాలేదు అని చెప్పవచ్చు.. దీంతో వర్మ సినిమాలమీద దృష్టి కంటే.. సోషల్ మీడియా లో పెట్టె పిచ్చి కామెంట్స్ మీద ఫోకస్ పెట్టాడు అని కొందరు అంటుంటారు.. కాగా గత కొంత కాలంగా వర్మ బయోపిక్ లంటూ.. సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.. ఎటాక్, వంగవీటి వంటి సినిమాలతో పాటు.. భూత్ రిటర్న్స్, నాట్ ఏ లవ్ స్టోరీ, డిపార్ట్ మెంట్ వంటి సినిమాలను చెత్తగా తీసి వర్మ.. చివరకు ప్రేక్షకులు వర్మ సినిమా అంటే భయపడే విధంగా చేస్తున్నాడు.. కాగా తాజాగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తో సర్కార్ 3 సినిమా తెరకెక్కించాడు.. ఎన్నో వివాదాల మధ్య రిలీజైన సర్కార్ 3 సినిమా కూడా పరమ చెత్తగా ఉన్నదని.. ప్రేక్షకులను థియేటర్ లో పెట్టి టార్చర్ చూపిస్తున్నాడు అని టాక్ వినిపిస్తోంది.. అంతేకాదు.. వర్మ లో సరుకు ఎప్పుడో అయ్యిపోయిందని.. ఇక సినిమాలకు దర్శకత్వం వహించడం మానేసి.. పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో పోస్ట్ లు కామెంట్స్ చేసుకొంటూ కాలక్షేపం చేస్తే బాగుంటుంది అని వర్మ కు ట్విట్టర్ లో సలహాలను కూడా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







