జూలై 1వ తేదీ నుంచి యూఏఈలో నూతన ట్రాఫిక్ నిబంధనలు, కొత్త జరిమానాలు
- May 15, 2017
" సమయం లేదు ..మిత్రమా...జాగ్రత్తగా ఉండటమా ? లేదా జరిమానాలు కట్టడమా ?? " గడువు సమీపిస్తోంది, నూతన ట్రాఫిక్ నిబంధనలు ఆమలులోనికి వస్తున్నాయి, కొత్త జరిమానాలను చెల్లించాల్సిన కాలం దగ్గరవుతోంది. జూలై 1వ తేదీ నుంచి యూఏఈలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే, ట్రాఫిక్ జరిమానాల ఖర్చు తడిచి మోపెడు కానుంది. జేబుల లోతుల నుంచి డబ్బుని జరిమానాల జాబితా కోసం తోడాల్సిఉంది. కొత్త ట్రాఫిక్ జరిమానాలు అమలు చేసిన తరువాత, ముందు వెళుతున్న వాహనాన్ని దురుసుగా భుజం పక్క నుంచి దూసుకు వెళ్లినందుకు 1000 ధిర్హాంల జరిమానాతో పాటు 6 నల్లని పాయింట్లు లభించనున్నాయి. అలాగే ట్రాఫిక్ ను అడ్డుకొన్నవారికి 1,000 ధిర్హాంల జరిమానా విధించనున్నారు.
ట్రాఫిక్ జరిమానాలు కొత్త ఖర్చు :
మాదక ద్రవ్యాలు లేదా మత్తు పదార్ధాల ప్రభావంతో డ్రైవింగ్ చేసిన వారికి, 23 బ్లాక్ పాయింట్లు మరియు 60 రోజుల జప్తును కోర్టు ద్వారా నిర్ణయిస్తారు
మద్యం ప్రభావంతో డ్రైవింగ్ చేసిన వారికి 23 బ్లాక్ పాయింట్లు మరియు 90 రోజుల జప్తును కోర్టు ద్వారా నిర్ణయిస్తారు
నెంబర్ ప్లేట్లు లేకుండా ఒక వాహనం డ్రైవింగ్ చేస్తే, 3,000 ధిర్హాంల జరిమానాతో పాటు 23 బ్లాక్
పాయింట్లు,90 రోజుల జప్తును కోర్టు ద్వారా నిర్ణయిస్తారు.
ఎర్రని లైట్ వద్ద ఆగకుండా వాహనాన్ని ఆ ప్రాంతం నుంచి దాటించిన వారికి 1000 ధిర్హాం ల జరిమానా
తో పాటు 30 రోజుల జప్తును కోర్టు ద్వారా నిర్ణయిస్తారు.
పాటు12 నల్లని పాయింట్లతో పాటు 30 రోజుల జప్తును కోర్టు ద్వారా నిర్ణయిస్తారు.
మొబైల్ ఫోన్లు మాట్లాడుతూ పరధ్యానంలో డ్రైవింగ్ చేసే డ్రైవర్లకు 800 ధిర్హాంల జరిమానాతో పాటు
నాలుగు నలుపు పాయింట్లు లభించనున్నాయి.
ప్రయాణీకులను చట్టవిరుద్ధంగా రవాణా చేసిన డ్రైవర్లకు 3,000 ధిర్హాంల జరిమానాతో పాటు 24 బ్లాక్
పాయింట్లు విధిస్తారు.
ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసినవారికి 2,000 ధిర్హాంల జరిమానాతో పాటు 60 రోజుల జప్తును కోర్టు
ద్వారా నిర్ణయిస్తారు.
రణగొణ ధ్వనులతో ధ్వనించే వాహనంను డ్రైవింగ్ చేసేవారికి : 2,000 ధిర్హాంల జరిమానాతో పాటు ఆరు
బ్లాక్ పాయింట్లను విధిస్తారు
అనుమతించబడిన 50 శాతం కారు కిటికీల అద్దాలను లేత రంగు స్థాయిని తగ్గించివేస్తే ఆయా
వాహనదారునికి 1,500 ధిర్హాంల జరిమానా విధిస్తారు.
గడువు ముగిసిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ ను పునరుద్ధరించని వాహనదారులకు 500,ధిర్హాం జరిమానాతో పాటు ఏడు రోజులు జప్తును కోర్టు ద్వారా నిర్ణయిస్తారు. (మూడు నెలలు గడువు ముగిస్తే)
ఒక వాహనం యొక్క10 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల చిన్న పిల్లలు లేదా145 సెంటీమీటర్ల ఎత్తు
కంటే తక్కువ ఉన్న పిల్లలను ముందు సీటులో కూర్చవడంకు అనుమతిస్తే ఆ వాహనదారునికి 400
ధిర్హాంల జరిమానాతో పాటు నాలుగు నలుపు పాయింట్లు విధిస్తారు.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీటుబెల్ట్ ని వాహనదారుడు నడుముకు కట్టుకొనికోకపోవడం జరిగితే, 400 ధిర్హాంల జరిమానా విధిస్తారు. అలాగే నాలుగు నలుపు పాయింటలను నమోదు చేస్తారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







