ఘనంగా జరిగిన టీఆర్ఎస్-యూఎస్ఏ నేషనల్ కాన్ఫరెన్స్
- May 15, 2017
కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో టీఆర్ఎస్-యూఎస్ఏ బే ఏరియా శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ యూఎస్ఏ రెండవ జాతీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. అమరులకు నివాళులు అర్పించి, ప్రొ. జయశంకర్, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్ రావుకి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి సభను ప్రారంభించారు.
స్థానిక టీఆర్ఎస్ యూఎస్ఏ నాయకులు పూర్ణ బైరి సభకు అధ్యక్షత వహించారు. ఎంపీ. కల్వకుంట్ల కవిత చేతుల మీదగా టీఆర్ఎస్-యూఎస్ఏ ప్రారంభై, రెండవ నేషనల్ కాన్ఫరెన్స్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పూర్ణ బైరి అన్నారు. టీఆర్ఎస్-యూఎస్ఏ వ్యవస్థాపకులు మహేష్ తన్నీరు, టీఆర్ఎస్ ఎన్నారై విభాగాల కోర్డినేటర్ బిగాల మహేష్ గుప్త, నాగేందర్ మహీపతిలు, రజినీకాంత్ కూసానం, నవీన్ కానుగంటి రూపొందించిన టీఆర్ఎస్-యూఎస్ఏ లోగో, తక్కళ్లపల్లి అరవింద్ రూపొందించిన ఫేస్ బుక్ పేజీను ఆవిష్కరించారు. భారీగా హాజరైన సభికులను ఉద్దేశించి వ్యవస్థాపకులు తన్నీరు మహేష్ ప్రసంగించారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను టీఆర్ఎస్-యూఎస్ఏ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ప్రగతిబాటలో పురోగమిస్తూ, వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం గులాభి కండువా కప్పి పలువురు ఎన్నారైలను టీఆర్ఎస్ అమెరికా శాఖలోకి ఆహ్వానించారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







