రమదాన్ 2017: పనివేళలు ఇవే
- May 15, 2017మూన్సైట్ ప్రకారం 27 మే నుంచి 24 జూన్ వరకు రమదాన్ మాసం ఉండనుంది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు రమదాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్థమయం వరకు ఈ ఉపవాస దీక్షలు ఉంటాయి. రమదాన్‌లో ఉపసవాస దీక్ష చేయడం అనేది ఇస్లాంలో ఐదవ పిల్లర్‌గా భావిస్తారు. బిలీఫ్, వర్షిప్, ఛారిటబుల్ గివింగ్, హజ్ - మక్కా పవిత్ర యాత్ర మిగతా నాలుగు ముఖ్యమైన పిల్లర్స్. ముస్లింలు తమ జీవితంలో ఒక్కసారైనా మక్కా యాత్ర చేయాలని దృఢ సంకల్పంతో ఉంటారు. ఇంకో వైపున ఉపవాస దీక్షలు ప్రశాంతంగా సాగేందుకోసం, ఖతారీ ప్రభుత్వం తగు చర్యలు చేపడుతూ వస్తోంది. ప్రభుత్వం, పనివేళల్ని తగ్గించడం ద్వారా ఉద్యోగులు, కార్మికులకు ఉపవాస దీక్షల సందర్భంగా వెసులుబాటు కల్పిస్తోంది. తద్వారా వారిపై పని ఒత్తిడి కొంత మేర తగ్గి, ఆ సమయాన్ని ప్రశాంతతో గడుపుతారు. ఈ నేపథ్యంలో జారీ చేసిన తాజా సర్క్యులర్ ద్వారా పనివేళల్ని నిర్ధారించారు. సివిల్ వర్కర్స్‌కి రోజుకి ఐదు గంటలు మాత్రమే పని వేళలుగా నిర్ధారించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని వేళల్ని నిర్ణయిస్తూ సర్క్యులర్ జారీ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







