విస్తారా ఎయిర్ లైన్స్ సమ్మర్ ఆఫర్
- May 16, 2017
వేసవి సెలవుల్లో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆఫర్ల బాట పట్టాయి పలు విమానయాన సంస్థలు. ఇప్పటికే స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిర్ఏషియా, గోఎయిర్ లాంటి సంస్థలు తక్కువ ధరలతో విమాన టికెట్లు ఆఫర్ చేస్తుండగా.. తాజాగా విస్తారా కూడా ఈ జాబితాలో చేరింది. రూ. 999 ప్రారంభ టికెట్ ధరతో ‘మిడ్-సమ్మర్’ సేల్‌ను ప్రకటించింది.
దేశీయ విమానాల్లో రూ. 999 ప్రారంభ ధరతో ఈ ఆఫర్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద జమ్ము-శ్రీనగర్, గువాహటి-బగ్దోగ్రా టికెట్ ధర రూ. 999గా ఉంది. ఇక దిల్లీ-చండీగఢ్‌కు రూ. 1,499, దిల్లీ-లఖ్‌నవూకు రూ. 1,549, దిల్లీ-అమృత్‌సర్‌కు రూ. 1,699 చొప్పున టికెట్ ధరలు ప్రకటించింది. మే 20 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జూన్ 12, 2017 నుంచి ఫిబ్రవరి 20, 2018 మధ్య విస్తారా విమానాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.
అయితే ఈ ఆఫర్ కింద పరిమిత సంఖ్యలో సీట్లను కేటాయించింది. కేవలం ఎకానమీ క్లాస్‌లోనే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపింది. ఇటీవలే ఆఫర్డబుల్ లగ్జరీ సేల్ కింద బిజినెస్ క్లాస్ టికెట్ ధరలను విస్తారా 50శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







