'ట్యూబ్ లైట్' సినిమా సాంగ్ ఆవిష్కరించిన సల్లూ భాయ్
- May 16, 2017
యూఏఈ:దుబాయ్ లో 'ది వెస్టిన్ హోటల్' లో 'ట్యూబ్ లైట్' రేడియో టీజర్ ని సల్మాన్ ఖాన్,సోహైల్ ఖాన్,కబీర్ ఖాన్,శ్రీధర్ సుబ్రహ్మణ్యం,కమాల్ ఖాన్ ఆవిష్కరించారు.‘సుల్తాన్’ తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘ట్యూబ్‌లైట్’. కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వ్యక్తిగత ఎమోజి కలిగిన తొలి బాలీవుడ్ చిత్రంగా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని కబీర్ ట్విటర్ ద్వారా తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. ట్విటర్‌లో ట్యూబ్‌లైట్‌కీఈద్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసినప్పుడు ఈ ఎమోజి కనిపిస్తుంది. సల్మాన్ మెడకు బూట్లు ధరించి సెల్యూట్ చేస్తూ చిన్న బొమ్మరూపంలో కనపడుతారు.
భారత్-చైనా సరిహద్దు నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం. సోహైల్‌ఖాన్, చైనా నటి చూచూ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కన్పిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రమదాన్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ పాట కొరకు క్రింద లింక్ క్లిక్ చెయ్యండి.




తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







