అల్పాదాయ కుటుంబాలకు రమదాన్ 'కానుక'
- May 16, 2017మనామా: ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, సోషల్ మరియు హ్యాండిక్యాప్ అలవెన్సుల్ని రమదాన్ సందర్భంగా రెండింతలు చేయాలని ఆదేశించారు. గుడైబియా ప్యాలెస్‌లో జరిగిన వీక్లీ క్యాబినెట్ సెషన్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అల్పాదాయం గల పౌరులకు సామాజిక భద్రత కల్పించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే, క్యాబినెట్లో 'సైబర్ ఎటాక్'పైనా చర్చ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ దాడుల నేపథ్యంలో, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. అలాగే, నార్తరన్ సిటీ ప్రాజెక్ట్‌లోని బిలాద్ అల్ ఖదీమ్, అల్ జింజ్ విలేజర్స్కి సంబంధించిన హౌసింగ్ నీడ్స్పైనా డైరెక్షన్స్ ఇచ్చారు ప్రీమియర్. ఇంకో వైపున, మీడియా, జర్నలిస్టులకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సముచిత స్థానం ఇవ్వాలని ప్రీమియర్ సూచించారు. జిసిసి దేశాల మధ్య సఖ్యత కోసం కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్స్ విరివిగా జరగాల్సి ఉందని ప్రీమియర్ చెప్పారు. ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్స్‌లోని బహ్రెయినీ ఉద్యోగుల భద్రతకు సంబంధించి కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది క్యాబినెట్. సమాజంలో మహిళల పాత్రకు సంబంధించి రీజినల్ వర్క్ షాప్ నిర్వహణపైన కూడా క్యాబినెట్ చర్చించింది.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







