నటుడు ధనుష్ హాలీవుడ్ చిత్రం ప్రారంభం
- May 16, 2017
టుడు ధనుష్ హాలీవుడ్ చిత్రంలో నటించనున్నారన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అది ఇటీవల ప్రారంభమైంది. ధనుష్ ప్రస్తుతం ఎన్నైనోక్కి పాయుం తోట్టా, వడచెన్నై, వేలై ఇల్లా పట్టాదారి 2 చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ధనుష్ తాజాగా హాలీవుడ్ చిత్రానికి మూడు నెలలు కాల్‌షీట్స్ కేటాయిం చారు.
బాగా పాపులర్ అయిన ఫ్రెంచ్ నవల ఆధారంగా కెనడాకు చెందిన కెన్ స్కాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ది ఎక్స్‌ట్రార్డనరీ జర్నీ ఆష్ ఫకీర్ అనే పేరును నిర్ణయించారు. ఇటీవలే బెల్జియంలో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం ఏకధాటిగా చిత్రీకరణను జరుపుకోనుందట. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ధనుష్ నిర్మాణంలో ఉన్న వడచెన్న, ఎన్నై నోక్కి పాయుం తోట్టా చిత్రాలపై దృష్టిసారించనున్నారట. వీటితో పాటు దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారని సమాచారం.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







