పవన్ కల్యాణ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
- May 16, 2017
ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసిన వాన్నా క్రై వైరస్ బాధితుల జాబితాలోకి ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేరినట్లు తెలుస్తోంది. అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన పవన్ కల్యాణ్ ట్విట్టర్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు తెలిసింది.
ఈ కారణంగానే గత మూడు రోజుల నుంచి పవన్ ట్విట్టర్ ఖాతాలో అంతరాయం ఏర్పడింది. బుధవారం పూర్తిగా బ్లాక్ అయిపోయింది. దీంతో తన ట్విట్టర్ ఖాతాలో అంతరాయం ఏర్పడిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిపై నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు పవన్. ట్విట్టర్ బ్లాకైందంటూ ఆయన అభిమానులను అప్రమత్తం చేశారు.
హైదరాబాద్‌లో 'ధర్నాచౌక్' అంశంపై స్పందించడానికి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే పాస్‌వర్డ్ ఛేంజ్ అయినట్లు మెసేజ్ డిస్‌ప్లే అయిందని పవన్ సన్నిహితుల నుంచి అందిన సమాచారం.
మూడు రోజుల క్రితమే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే అవలేదని, ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చని పవన్ భావించాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. అయితే చివరిగా తన అకౌంట్ హ్యాక్ అయినట్లు పవన్ కల్యాణ్ గుర్తించారని తెలిసింది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ట్విట్టర్ అకౌంట్‌ను 18 లక్షల మందికిపైగా ఫాలో అవుతున్నారు. ఎప్పుడూ ట్విట్టర్ ద్వారానే ఎక్కువగా పలు సమస్యలు, అంశాలపై స్పందించే పవన్‌కు.. ఇప్పుడు ట్విట్టర్ హ్యాక్ కావడంతో కొంత విరామం లభించే అవకాశం ఏర్పడింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







