ఒంగోలులోని రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
- May 19, 2017
ఒంగోలులోని ప్రముఖ వ్వవసాయ రసాయనాల తయారీ కేంద్రం భగీరథ కెమికల్స్‌లో శనివారం తెల్లవారుజామున సుమారు 4గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీ నుంచి మంటలు వెలువడి మూడంతుస్తుల ప్రధాన ఉత్పత్తి కేంద్రం నిలువునా అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చారని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పరిశ్రమ యాజమాన్య వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







