ప్రమాదాల్ని చిత్రీకరిస్తే జరీమానా !
- May 20, 2017
రోడ్డు ప్రమాదాల్ని చిత్రీకరిస్తే, ఆ నేరానికిగాను మీరు జైలుకు వెళ్ళాల్సి రావొచ్చు. ఎంపీలు కొత్త చట్టం దిశగా సమాలోచనలు చేస్తున్న దరిమిలా, ఆ చట్టం అమల్లోకి వస్తే ప్రమాదాల పట్ల అత్యుత్సాహం చూపేవారికి జైలు శిక్ష తప్పదు. ఈ అంశానికి సంబంధించి ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ మరియు నేషనల్ సెక్యూరిటీ కమిటీ ప్రిపేర్ చేసిన రిపోర్ట్, హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్లో చర్చకు వస్తుంది. ఎంపీ మొహమ్మద్ అల్ మారిఫి, గత ఏడాది దీనికి సంబంధించి ఓ ప్రపోజల్ని కమిటీకి అందజేశారు. ఈ నేపథ్యంలో, కమిటీ పలు అంశాల్ని పరిశీలించింది. కమ్యూనికేషన్ టెక్నాలజీ విభాగంలో వింత పోకడలు మానవత్వానికి మాయని మచ్చలా కొన్ని సందర్భాల్లో మారుతున్నాయని అల్ మరాఫి చెప్పారు. అత్యంత దయనీయ స్థితిలో ప్రమాద బాధితులు ఉన్నప్పుడు, వారి దీన స్థితిని కెమెరాల్లో బంధించడం, వాటిని పబ్లిష్ చేయడం క్రూరత్వం కింద భావించాలని ఆయన అంటున్నారు. గురువారం జరిగే సమావేశంలో చర్చించిన అనంతరం, షురా కౌన్సిల్ అలాగే ప్రభుత్వానికి తదుపరి అనుమతి కోసం ఈ అంశం పంపబడుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి







