కేరళలోని గురువాయుర్‌ ఆలయానికి బాంబు బెదిరింపు

- May 20, 2017 , by Maagulf
కేరళలోని గురువాయుర్‌ ఆలయానికి బాంబు బెదిరింపు

కేరళలోని ప్రసిద్ధ కృష్ణ మందిరం గురువాయుర్‌ ఆలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆలయాన్ని ధ్వంసం చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్‌ రావడంతో ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అంతేగాక, ఆలయ నిర్వహణలో అవినీతి జరుగుతోందని సదరు వ్యక్తులు ఫోన్లో చెప్పినట్లు అధికారులు చెప్పారు.
ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్‌ రికార్డుల వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా ఆలయం వద్ద భద్రతను ఏర్పాటుచేశారు. బాంబు నిర్వీర్య బృందంతో తనిఖీలు నిర్వహించారు. కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో గురువాయుర్‌ ఆలయం ఒకటి. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com