బిలియనీర్‌ జేమ్స్‌ మాథ్యూని పెళ్లాడిన పిప్పా

- May 20, 2017 , by Maagulf
బిలియనీర్‌ జేమ్స్‌ మాథ్యూని పెళ్లాడిన పిప్పా

బ్రిటీష్ యువరాజు విలియమ్స్ అర్థాంగి యువరాణి కేట్ మిడిల్టన్  సోదరి పిపా మిడిల్టన్‌ వివాహం అంగ రంగ వైభోగంగా జరిగింది.   బెర్క్ షైర్లోని సెయింట్ మార్క్స్ చర్చిలో  బిజినెస్‌మ్యాన్‌, బిలియనీర్‌ జేమ్స్‌ మాథ్యూని   పిప్పా పెళ్లాడింది. అంతకు ముందు తండ్రి మై​ఖేల్‌ డిమిల్టన్‌  పెళ్లి వేదికకు   ఓపెన్‌ టాప్‌ వింటేజ్‌ జాగ్వర్‌ కార్‌ లో  పిపా ను తీసుకొని వచ్చారు. ప్రిన్స్ జార్జ్,  ప్రిన్సెస్‌ షార్లెట్ లతోపాటు కేంబ్రిడ్జ్ డ్యూక్ ప్రిన్స్ విలియమ్స్ దంపతులు, ఇతర రాజ కుటుంబీకులు, జేమ్స్‌  సోదరుడు , రియాల్టీ  స్టార్‌ స్పెన్సెర్‌ మాథ్యూ   ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ రాయల్‌ వెడ్డింగ్‌ కు  వింబుల్డన్‌  టెన్సిస్‌  మాజీ ఛాంపియన్‌  రోజర్‌  ఫెదరర్‌ లాంటి  ఇతర ప్రముఖులు, రాయల్‌ అతిథులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com