బాడీగార్డ్స్కి సల్మాన్‌ఖాన్ బంపర్ ఆఫర్
- May 21, 2017
సల్మాన్‌ఖాన్ అంటే అభిమానులకే కాదు.. తోటి బాలీవుడ్ నటులు కూడా ఇష్టపడతారు. తన మంచితనంతో అందరిని కలుపుకుపోయే సల్మాన్‌ను మంచి మనస్సున్న వ్యక్తి అంటూ అందరూ మెచ్చుకుంటారు. అయితే.. తాజాగా తన బాడీగార్డ్స్కి బంపర్ ఆఫర్ ఇచ్చి మంచి వ్యక్తిగానే కాదు.. మంచి బాస్ అని కూడా అనిపించుకున్నాడు ఈ కండల వీరుడు.
ప్రస్తుతం ‘ట్యూబ్‌లైట్’ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సల్మాన్ ఇటీవల దుబాయ్ వెళ్లారు. అక్కడే ఈ చిత్రంలోని ఒక పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమం గురించి ముందే తెలిసిన సల్మాన్ దుబాయ్‌లో తన బాడీగార్డ్స్కి సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ ప్రచార కార్యక్రమం పూర్తవగానే సల్మాన్ వెంటనే తన సర్ప్రైజ్ ప్లాన్ అమలు చేశాడు. అది ఏంటంటే.. తన బాడీగార్డ్స్ షాపింగ్ చేయడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు. వారికి ఏది నచ్చితే అది తీసుకోమన్నాడు.
వాటికి అయిన బిల్లును సల్మాన్ స్వయంగా చెల్లించారట. అంతేకాదు.. వారి జీతాలు కూడా పెంచి మరింత సర్ప్రైజ్ ఇచ్చాడంట సల్మాన్.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







