ఉత్తరకొరియా మరో ఖండాంతర క్షిపణి ప్రయోగం విజయవంతం
- May 21, 2017
అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు, ఒత్తిళ్లు వచ్చినా ఉత్తరకొరియా తీరు మారలేదు. తాజాగా.. ఆ దేశం మరో ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. పుక్చాంగ్ సమీపం నుంచి ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించిందని దక్షిణ కొరియా సైనికాధికారులు ప్రకటించారు.
సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఈ మధ్యశ్రేణి క్షిపణి ఛేదించింది. అ క్షిపణికి అమెరికాలోని అలస్కా, హవాయ్‌లను చేరుకోగల సామర్థ్యముందని తెలుస్తోంది. అయితే.. ఆ క్షిపణికి హెవీ న్యూక్లియర్ వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం ఉందా? అనేది తెలియాల్సి ఉంది.
జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాతే.. ఉత్తర కొరియా సుమారు 10 క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది. ఒకవైపు ఉత్తరకొరియా అణ్వస్త్ర ప్రయోగాల దూకుడుకు కళ్లెం వేసేలా ట్రంప్ దౌత్యపరమైన ఆంక్షలు విధిస్తుండగానే మరో క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించడం.. ఉత్తరకొరియా తెంపరితనాన్ని సూచిస్తోంది.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







