హైదరాబాద్‌లో వాడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ తో బస్ స్టాప్స్ నిర్మాణం.. ఆకర్షిస్తోన్న వైనం
- May 21, 2017
కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీ శ్రీ.. కాదేదీ నిర్మాణానికి అనార్హం అంటున్నారు.. నేటి యువ శక్తి... అవును సృష్టిలో మానవుడు ఒక్కడే వ్యర్ధ పదార్ధం.. మిగిలినవన్నీ మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోదగినవే అన్న సంగతి విధితమే.. కాగా మానవుని సృష్టి.. ప్లాస్టిక్ కూడా వ్యర్దమే.. ఈ ప్లాస్టిక్ ని ఏ రూపంలో ఉపయోగించినా.. తిరిగి పడవేసే సమయంలో భూమిలోకి అవి కరగవు.. దీంతో పర్యావరణానికి ఎంతో హాని చేకూరుతుంది ఈ ప్లాస్టిక్ వల్ల.. కాగా ఇక ప్లాస్టిక్ బాటిల్స్ కూడా అదే కోవలోకి చేరతాయి.. కానీ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ను ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో ఎన్నో ఉపయోగకరమైన పనులను చేస్తోంది... బాంబూ హౌజ్ ఇండియా అనే సంస్థ... అవును ప్లాస్టిక్ ని రీ సైకిల్ ఇండియా పేరుతో బాంబూ హౌస్ ఇండియా సంస్థ ఓ సరికొత్త నిర్మాణానికి తెరతీసింది. ఇప్పటికే వాడి పడేసిన టైర్లు, ప్లాస్టిక్ డ్రమ్స్‌ను రీసైకిల్ చేసి వాటితో సీట్లు, బెంచీలు తయారు చేస్తోన్న సంగతి విధితమే.. కాగా తాజాగా ఈ సంస్థ ఉప్పల్‌లోని స్వరూపనగర్ కాలనీలో ప్లాస్టిక్ బాటిల్స్‌తో ఓ బస్ షెల్టర్ ను నిర్మించింది. కాగా హైదరాబాద్‌లో సరిపడా బస్ షెల్టర్లు లేకపోవడంతో… బస్ షెల్టర్లు నిర్మించేందుకు తమ సంస్థ ముందుకొచ్చిందని తెలిపింది యాజమాన్యం. బస్ షెల్టర్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు పెద్దమొత్తంలో డబ్బులను డిమాండ్ చేయడంతో ప్రభుత్వం కూడా కాస్త వెనకడుగు వేసింది. ఈ క్రమంలోనే తమ కంపెనీ ప్లాస్టిక్ బాటిల్స్ తో బస్‌షెల్టర్‌ను నిర్మిస్తుంది అని యాజమాన్యం తెలిపింది.. ఈ బస్ షెల్టర్‌ను తయారు చేసేందుకు 1000 ఒక లీటర్ వాటర్ బాటిల్స్ వినియోగించినట్లు బాంబూ హౌజ్ ఇండియా వ్యవస్థాపకులు ప్రశాంత్ తెలిపారు. ఒక్కో బాటిల్ రూ1.40 కి కొనుగోలు చేసినట్లు ... బస్ షెల్టర్ కొలతలు 8*4 అడుగులుగా ఉందని, దీంతో ఆ సైజ్ ఫ్రేమ్‌ను మెటల్‌తో తయారు చేసినట్లు ప్రశాంత్ తెలిపారు. ఇవన్నీ ఖరీదు చెయ్యడానికి అయిన మొత్తం అయిన ఖర్చు కేవలం రూ.15వేలు అని చెప్పారు. అంతేకాదు అనవసరం అనుకుంటే మళ్లీ ఈ షెల్టర్ ను తొలగించొచ్చని చెప్పారు. ఈ నిర్మాణాలు తక్కువ ఖర్చుతో జరగడమే కాదు.. ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







