తమిళనాడు లో రజనీకాంత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు
- May 22, 2017
తమిళనాట అగ్గి రాజుకుంది. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై సస్పెన్స్ వీడక ముందే... తమిళ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. తలైవా.. తమిళుడు కాదని.. కన్నడిగుడనే వాదనని ప్రధానంగా తెరపైకి తెస్తున్నారు. చెన్నైలోని రజనీకాంత్ నివాసం ముందు ఆందోళనకు దిగారు. అటు.. కోయంబత్తూరులో కబాలి దిష్టిబొమ్మను తగులబెట్టారు.
తమిళనాట రజనీకాంత్ తిరుగులేని స్టార్ హీరో. ఆయన వెటరన్‌గా మారినా, నవతరం యువ కథానాయకులు వచ్చినా.. తలైవా ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. అరుణాచలం, నరసింహ సినిమాల దగ్గరి నుంచి ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై తరచు వార్తలు వస్తున్నాయి. అయితే.. రీసెంట్గా ఆయన పాలిటిక్స్‌పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. మూడు రోజులు ప్యాన్స్‌తో సమావేశమై తన మనసులో మాట బయటపెట్టారు. రాజకీయాలపై రజనీకాంత్‌కు పిచ్చ క్లారిటీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఆందోళనల్ని కూడా ఆయన ముందే ఊహించారు. తాను జన్మతహ తాను తమిళుడ్ని కాకపోయినా.. ఇన్నేళ్ల అనుబంధంతో పూర్తిగా తమిళుడ్ని అయ్యానంటూ ఫ్యాన్స్ ముందు భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు ఆయన స్థానికతను ఇష్యూ చేస్తూ తమిళ సంఘాలు ఆందోళనకు దిగాయి. చెన్నైలోని సూపర్‌స్టార్ నివాసం ముందు ధర్నాకు దిగిన నిరసనకారుల్ని పోలీసులు అదుపు చేశారు. మరోవైపు.. తమిళనాడులోని మిగతా పట్టణాల్లోను ఆందోళనలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







