స్వర్ణోత్సవ కానుకగా శ్రీదేవి నటించిన 'మామ్'
- May 22, 2017
భా రతీయ వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ అని నిరూపించుకునేలా సినిమాలు చేసోన్నారు. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం ‘మామ్’లో నటిస్తున్నారు. శ్రీదేవి సినిమాల్లోకి అడుగుపెట్టిన 50వ వసంతమిది. అంతేకాదు ‘మామ్’ ఆమె 300వ చిత్రం కావడం మరో విశేషం. దీనికి గుర్తుగా మామ్ విడుదలవుతున్న అన్ని భాషల్లోనూ తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోనుంది శ్రీదేవి. ‘‘తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ‘మామ్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నాలుగు భాషల్లోనూ తన పాత్రకి తనే గాత్రం అందించనున్నారు శ్రీదేవి.
ఆమె కెరీర్ మొదలుపెట్టిన జులై 7నే ‘మామ్’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాత బోనీకపూర్. రవి ఉదయార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







