ప్రపంచంలో దేశీయ వలసల్లో భారత్‌ది మూడోస్థానం
- May 22, 2017
భారత్‌లో 2016లో దాదాపు 24 లక్షల మంది స్వదేశంలోనే వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లారని ఓ నివేదిక పేర్కొంది. అంతర్గత వలసలు ఎక్కువగా నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. అంతర్గత వలసల పర్యవేక్షణ కేంద్రం (ఐడీఎంసీ), నార్వేజియన్ శరణార్థుల మండలి (ఎన్‌ఆర్‌సీ)లు కలిసి ఈ నివేదికను విడుదల చేశాయి. నివేదిక ప్రకారం 2016లో అత్యధికంగా చైనాలో 74 లక్షల మంది స్వదేశంలో వలసపోగా, తర్వాతి స్థానంలో ఫిలిప్పీన్స్ (59 లక్షల మంది) ఉంది.
ఘర్షణలు, హింస, ప్రకృతి విపత్తులు స్వదేశీ వలసలకు ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా 3.1 కోట్ల మంది స్వదేశాల్లోనే తమ నివాస స్థలాలను మార్చుకోవాల్సి వచ్చింది. 2015లో దక్షిణాసియా దేశాల్లో 79 లక్షల మంది స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు వెళ్లగా, 2016లో ఈ సంఖ్య సగానికి పైగా తగ్గి 36 లక్షలకు పరిమితమైంది. ఇందులో భారత్ నుంచే 24 లక్షల మంది ఉండడం గమనార్హం. భారత్‌లో బిహార్‌లో గతేడాది జూలై–అక్టోబర్‌ల మధ్య సంభవించిన వరదల వల్లే 16 లక్షల మంది వలసపోయారని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







