రమదాన్ సందర్భంగా షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- May 24, 2017
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో వివిధ జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ ఆఫ్ దుబాయ్, కౌన్సిలర్ ఇస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ వెల్లడించారు. ఈ క్షమాభిక్ష, ఖైదీ కుటుంబ సభ్యుల్లో ఆనందం నింపుతుందన్నారు. వివిధ దేశాలకు చెందినవారికి ఈ క్షమాభిక్ష లభించనుంది. మొత్తం 1,014 మంది ఖైదీలు క్షమాభిక్ష పొందనున్నారు. షేక్ మొహమ్మద్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టిందన్నారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 977 మంది ఖైదీలను విడుదల చేయాల్సిందిగా ఆదేశించిన మరుసటి రోజు ఈ ఆదేశం వచ్చింది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం
- కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి
- ప్రాంతీయ సంక్షోభాలను అంతం చేయడానికి దౌత్యమే ఏకైక మార్గం..!!
- యునెస్కో-సుల్తాన్ హైథమ్ బహుమతి..సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు గుర్తింపు..!!
- యూఏఈ లాటరీ: తాజా డ్రా విజేతల సంఖ్యలు.. ఎవరికీ దక్కని జాక్పాట్..!!
- 10 ఏళ్ల జైలు శిక్ష, 10 మిలియన్ల సౌదీ రియాల్స్ జరిమానా..!!
- 105,000 మంది కార్మికులకు 94 మిలియన్ల బహ్రెయిన్ దినార్ల మద్దతు..!!
- కార్మికుల సమావేశంపై పీఏఎం చర్యలు.. క్రిమినల్ దర్యాప్తునకు రిఫర్..!!
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్









