వలస ఖైదీలకు వ్యాపారవేత్త ఉపశమనం
- May 24, 2017
మనామా: కింగ్‌డమ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, జైళ్ళలో మగ్గుతున్న 400 మంది ఖైదీలకు శుభవార్త అందించారు. కోర్టులు విధించిన జరీమానాలు చెల్లించలేనివారు, అలాగే అప్పులు చేసి వాటిని తీర్చలేనివారు - ఇలా జైళ్ళలో మగ్గుతున్నవారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారాయన. ప్యూర్ గోల్డ్ గ్రూప్ ఫౌండర్ మరియు ఛైర్మన్ ఫిరోజ్ మర్చంట్, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాల్ని వెల్లడించారు. జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్ అండ్ ఇంటీరియర్ మినిస్ట్రీస్‌తో ఈ అంశంపై చర్చించినట్లు తెలిపారాయన. ప్రస్తుతం 10,000 బహ్రెయినీ దినార్స్‌ని ఈ కార్యక్రమం కోసం తమ గ్రూపు వెచ్చించనున్నట్లు వివరించారాయన. ఏడాదికి 120,000 బహ్రెయినీ దినార్స్ ఖర్చు చేసి, ఖైదీలకు ఉపశమనం కల్పించనున్నట్లు తమ వ్యూహాల్ని వెల్లడించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ నిర్నయం తీసుకున్నట్లు మర్చంట్ చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







