వ్యాట్ కోసం సంస్థలు సంసిద్ధంగా ఉండాలి
- May 24, 2017
మనామా: సంస్థలు, తమ ఐటి సిస్టమ్స్‌ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్‌కి అనుగుణంగా మార్పులు చేసుకునేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆ రంగ నిపుణులు సూచిస్తున్నారు. తమ తమ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ని వ్యాట్‌కి అనుకూలంగా మార్ల్పులు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్‌ఎస్‌ఎం సీనియర్ కన్సల్టెంట్ టిపి ఆనంద్ చెప్పారు. వ్యాట్ త్వరలో అమలు కానున్న నేపథ్యంలో, అప్పటికప్పుడు సమస్యలు కొనితెచ్చుకోకుండా ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమమని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎం బహ్రెయిన్ నేతృత్వంలో వ్యాట్ అలర్ట్ సెమినార్ ఏర్పాటు చేయబడింది. మైక్రో సాఫ్ట్ ఎక్సెల్ లేదా బేసిక్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ వినియోగిస్తున్న సంస్థలు ఖచ్చితంగా వ్యాట్‌కి అనుగుణంగా అప్‌డేట్ కావాల్సి ఉందన్నారు. ఆయా సంస్థలు తమ తమ ఉద్యోగుల్ని వ్యాట్‌పై అవగాహన పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన వివరించారు. 2018 నుంచి అమలు చేయబడే వ్యాట్ తొలి దశలో 5 శాతం ఉండే అవకాశం ఉంది. కొన్ని వస్తువులపై మాత్రం వ్యాట్ నుంచి మినహాయించనున్నారు. హెల్త్ కేర్, కొన్ని ఫుడ్ ఔటమ్స్, సోషల్ సర్వీసెస్, లోకల్ ట్రాన్స్‌పోర్ట్, ఎడ్యుకేషన్ వంటి రంగాలకు మినహాయిస్తున్నారు.
తాజా వార్తలు
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం
- కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి
- ప్రాంతీయ సంక్షోభాలను అంతం చేయడానికి దౌత్యమే ఏకైక మార్గం..!!
- యునెస్కో-సుల్తాన్ హైథమ్ బహుమతి..సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు గుర్తింపు..!!
- యూఏఈ లాటరీ: తాజా డ్రా విజేతల సంఖ్యలు.. ఎవరికీ దక్కని జాక్‌పాట్..!!
- 10 ఏళ్ల జైలు శిక్ష, 10 మిలియన్ల సౌదీ రియాల్స్ జరిమానా..!!
- 105,000 మంది కార్మికులకు 94 మిలియన్ల బహ్రెయిన్ దినార్ల మద్దతు..!!
- కార్మికుల సమావేశంపై పీఏఎం చర్యలు.. క్రిమినల్ దర్యాప్తునకు రిఫర్..!!









