సచిన్ టెండూల్కర్ ప్రత్యేక షో: కుటుంబంతో అమితాబ్, హాజరైన షారుక్ ఖాన్ , అమీర్ ఖాన్
- May 25, 2017
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన 'సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమాను బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు బుధవారం వీక్షించారు. ముంబైలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు బాలీవుడ్ దిగ్గజాలు హాజరయ్యారు.
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని టీమిండియా ఆటగాళ్లతో పాటు బాలీవుడ్ ప్రముఖులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆత్మీయులు, సన్నిహితులు ఇలా సచిన్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ప్రముఖులతో బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్ కళకళలాడింది.
ఈ సినిమా ప్రత్యేక షోకు వచ్చిన అందరికీ సచిన్ జోడీ ఆత్మీయస్వాగతం పలికింది. సినిమాని వీక్షించిన వారిలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ దంపతులు, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్‌లతో పాటు పారి శ్రామికవేత్త ముకేశ్ అంబానీ దంపతులు హాజరయ్యారు.
వీరితో పాటు మాస్టర్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్, సచిన్ సోదరుడు అజిత్ టెండూల్కర్, స్టార్ బాక్సర్ విజేందర్, ప్రముఖ గాయని ఆశాభోంస్లే, కృతి సనన్‌తో కలిసి సుశాంత్ సింగ్ రాజు పుత్, సాగరికతో జహీర్ ఖాన్, రెహమాన్‌లు హాజరయ్యారు.
1
సచిన్ ప్రీమియర్ షోకి హాజరైన అమితాబ్ కుటుంబం
బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్‌లో సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన 'సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమా వీక్షణకు బాలీవుడ్ ప్రముఖులు తరలివచ్చారు. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తన కుమారుడు అభిషేక్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్‌లను మీరు చూడొచ్చు.
2
అమీర్ ఖాన్
సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన 'సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా వీక్షించిన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్.
3
షారుక్ ఖాన్
సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన 'సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా వీక్షించిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్.
4
సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌తో కృతి సనన్
సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన 'సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా వీక్షించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌తో కృతి సనన్.
5
రణవీర్ సింగ్
సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన 'సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా వీక్షించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌తో రణవీర్ సింగ్.
6
రెహమాన్
సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన 'సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమాకు రెహమాన్ సంగీతం అందించారు. బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్‌లో 'సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమాను ప్రదర్శనకు వచ్చిన రెహమాన్‌ని మీరు చూడొచ్చు
7
అంబానీ కుటుంబం
సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన 'సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా ప్రత్యేక షోకు హాజరైన అంబానీ కుటుంబం.
8
సాగరికతో జహీర్ ఖాన్
సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన 'సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా ప్రత్యేక షో వీక్షించడానికి సాగరికతో కలిసొచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్. పక్కనే మాజీ క్రికెటర్ అజయ్ జడేజా.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







