తీపికబురు వచ్చే నాలుగైదేళ్లలో 25 లక్షల ఐటీ ఉద్యోగాలు
- May 25, 2017
ఉద్వాసన భయంతో ఐటీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్న సమయంలో కేంద్రం ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీపికబురు చెప్పారు. వచ్చే నాలుగైదేళ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 20-25 లక్షల ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఈ ఉద్యోగాల కల్పన జరగనుందని వివరించారు. మూడేళ్ల మోదీ పాలనలో తన మంత్రిత్వశాఖ సాధించిన విజయాల గురించి ఓ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. డిజిటల్ ఎకానమీ రోడ్ మ్యాప్ తయారీ కోసం కన్సల్టెన్సీ సంస్థ మెకెన్సీని నియమించినట్టు పేర్కొన్నారు. వచ్చే 5-7 ఏళ్లలో దేశంలోని డిజిటల్ ఎకానమీ ఒక ట్రిలియన్‌కు చేరుకుంటుందన్నారు. ఐటీ రంగం నుంచి ఉద్యోగులు పెద్దమొత్తంలో ఉద్వాసనకు గురికానున్నట్టు వస్తున్న వార్తను ఖండించిన రవిశంకర్ ప్రసాద్ వచ్చే నాలుగైదేళ్లలో 20-25 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







