వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమైన అమెరికా అధ్యక్ష్యడు
- May 25, 2017
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటన జరుపుతున్న డొనాల్డ్ ట్రంప్ బుధవారం వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాంతిని పెంపొందించడానికి అమెరికా అధ్యక్షుడిగా తన పలుకుబడిని ఉపయోగించాలని ట్రంప్‌ను కోరారు. పోప్‌ను కలుసుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ట్రంప్ అన్నారు. పోప్ ప్రాన్సిస్‌కు శాంతికి చిహ్నమైన ఆలివ్ ట్రీ చెక్కిన ఒక పతకాన్ని ట్రంప్‌కు బహూకరించారు. ‘మీరు శాంతికి కారణమవుతారన్న ఉద్దేశంతో నేను మీకు దీన్ని ఇస్తున్నాను’ అని పోప్ ఈ సందర్భంగా స్పానిష్ భాషలో ట్రంప్‌తో అన్నారు. మీరన్న మాటలను గుర్తుంచుకుంటానని ట్రంప్ అన్నారు. నిజానికి పోప్ ఫ్రాన్సిస్ అనేక విషయాల్లో ట్రంప్ విధానాలతో తీవ్రంగా విభేదిస్తుంటారు. ముఖ్యంగా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మిస్తామన్న ట్రంప్ ప్రకటనపై ఫ్రాన్సిస్ తీవ్రంగా స్పందించడం తెలిసిందే. అలాగే పర్యావరణం, గర్భస్రావాలు లాంటి అనేక విషయాల్లో సైతం ఫ్రాన్సిస్, ట్రంప్ అభిప్రాయాలు పూర్తి భిన్నంగా ఉండడం అందరికీ తెలిసిందే.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







