పెట్రోకెమికల్ గిడ్డంగిలో అగ్ని ప్రమాదం దెబ్బతిన్న 27 వాహనాలు
- May 25, 2017
అల్ రాయ్:స్థానిక పెట్రోకెమికల్ కర్మాగారంలో బుధవారం సంభవించిన ఒక అగ్నిప్రమాదం సమర్ధవంతంగా అదుపు చేసినట్లు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ తెలిపింది. బుధవారం ఉదయం రాయ్ ప్రాంతంలో 2,000 చదరపు మీటర్ల పరిధిలో పెట్రోకెమికల్స్ గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక నియంత్రణ సమయంలో 27 వాహనాలు దెబ్బతిన్న నేపథ్యంలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 2,000 చదరపు మీటర్ల పెట్రోకెమికల్ ప్లాంట్లో అగ్నిని అదుపులోనికి తెచ్చేందుకు ఆరు అగ్నిమాపక బృందాలు తక్షణమే ప్రమాద స్థలానికి తరలివెళ్ళాయి. ఎలాగైతే, పెట్రోకెమికల్ కర్మాగారంలో ఎగిసిపడిన భారీ జ్వాలలను అదుపు చేసినప్పటికీ పెద్ద స్థాయిలో ఆస్తులు నష్టం వాటిల్లిందని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒప్పుకుంది. ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాద సంఘటనకు ఖచ్చితమైన కారణాలను కనుగొనడానికి సంబంధిత అధికారులచే పరిశోధన జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







