అస్సామీ బ్రేక్‌ఫాస్ట్ పోయిట భాత్
- May 25, 2017
కావాల్సిన పదార్థాలు
అన్నం - ఒక కప్పు, పెరుగు - పావు కప్పు లేదా మజ్జిగ - అరకప్పు, ఉల్లి తరుగు - రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి (తరిగి) - రెండు, ఉప్పు - రుచికి సరిపడా.
ఆలు పిటిక కావలసినవి:
ఆలు(బంగాళాదుంపలు) - మూడు, పసుపు - అర టీస్పూన్, ఆవనూనె - ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి - రెండు, ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ విధానం
అన్నంలో రెండు కప్పుల నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి.
మరుసటి రోజు ఉదయం చిలికన పెరుగు లేదా మజ్జిగ పోసి బాగా కలపాలి. తరువాత ఉప్పు, ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి పక్కన పెట్టాలి.
ఆలూ పిటిక తయారీ కోసం ఆలుని ఉడికించాలి. తరువాత పొట్టు తీసి మెత్తగా చేతితో నలపాలి.
కడాయిలో ఆవనూనె వేడిచేయాలి. పొగలు వస్తున్నప్పుడు పసుపు వేసి కలపాలి.
వెంటనే మెదిపిన ఆలుని వేసి బాగా కలపాలి.
తరిగిన పచ్చిమిర్చి వేసి మరోసారి కలపితే ఆలూ పిటిక రెడీ.
ఈ అస్సామీ బ్రేక్‌ఫాస్ట్ వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు చాలా బాగా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







