సనాడ్ లో ఆల్ కిండి హాస్పిటల్ కొత్త శాఖ ప్రారంభం
- May 25, 2017
సనాడ్ బీఎన్ఐ కాంప్లెక్స్ లో అల్ కండి స్పెషలిస్ట్ హాస్పిటల్ కు సంబంధించిన మరో కొత్త శాఖ 'ఆల్ కింది మెడికల్ సెంటర్' గురువారం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు, సుప్రీం హెల్త్ కౌన్సిల్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా షురా కౌన్సిల్ చైర్మన్ అలీ బిన్ సలేహ్ అల్ సలేహ్ సమక్షంలో రెండవ శాఖను లాంఛనంగా మొదలుపెట్టారు. ఆయనతో పాటు అల్ కండి హాస్పిటల్ సిఈఓ డాక్టర్ ఎబ్తిసామ్ ఆల్ దల్ల్, అధ్యక్షుడు డాక్టర్ ఫైసల్ అల్ ముస్వీ, బోర్డు సభ్యుల డాక్టర్ హనన్ మదన్, మొహమ్మద్ అలీ అల్ అబ్బాస్, సమీర్ అల్ వాజ్జాన్ మరియు హసన్ ఫాఖ్రో. ఈ శాఖ 24-గంటల పాటు పని చేసే క్లినిక్ గా కొనసాగనునుంది. ఈ ఆసుపత్రిలో బాల్యదశలో వచ్చే వ్యాధుల నివారణా వైద్యులు (పేడియాట్రిక్స్), దంత సేవ, ప్రసూతి, గైనకాలజీ, చర్మవ్యాధులు నిపుణులు (డెర్మటాలజీ) ప్రసూతి విభాగం (లేజర్ క్లినిక్) ఇతర సంబంధిత ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక సేవలతో పాటు, మెడికల్ సెంటర్ తో పాటు ఒక ప్రయోగశాల ,రేడియాలజీ మరియు ఫార్మసీ సేవలను ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- Jordan's King, UK PM discuss latest regional developments
- Dubai Police Honours Mental Health Champions for Strengthening Workplace Wellbeing
- దుబాయ్‌లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్‌లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్‌లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!







