మన తాజమహల్ కు ఆసియా కట్టడాల్లో రెండో స్థానం
- May 27, 2017
ప్రేమకు చిహ్నంగా ప్రపంచ కళాఖండంగా వెలుగుతున్న తాజ్ మహల్ ఘనత మరో మెట్టు ఎక్కింది. అంతర్జాతీయ ట్రిప్ అడ్వైజర్ సంస్థ తాజాగా రూపొందించిన జాబితా ప్రకారం మన తాజ్ మహల్ ప్రపంచ అద్బుత కట్టడాల్లో ఐదో స్థానంలోనూ, ఆసియా అద్భుత కట్టడాల్లో రెండో స్థానంలో నిలిచింది. పర్యాటక సేవలందించే ప్రముఖ 'ట్రిప్ అడ్వైజర్' సంస్థ ఈ జాబితాను రూపొందించింది.
ప్రపంచంలోని తొలి పది అద్భుత కట్టడాల్లో తాజ్‌మహల్ ఐదో స్థానంలో నిలిచింది. 'ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ ఫర్ ల్యాండ్‌మార్క్స్' పేరిట ట్రిప్ అడ్వైజర్ ఈ జాబితాను విడుదల చేసింది. కాంబోడియాలోని అంగ్ కోర్‌వాట్ దేవాలయం ఈ జాబితాలో తొలి స్థానం దక్కించుకుంది.
ఇక రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ సెంటర్, స్పెయిన్‌లోని మెజ్‌క్విటా క్యాథడ్రెల్ డీ కోర్డొబా, వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా నిలిచాయి. తర్వాత స్థానాల్లో రష్యాలోని 'చర్చ్ ఆఫ్ ద సేవియర్ ఆన్ స్పిల్ల్‌డ్ బ్లడ్ (6), బీజింగ్‌లోని గ్రేట్‌వాల్ (7), పెరూలోని మచుపిచు (8) స్పెయిన్‌లోని ప్లాజా డీ ఎస్పనా (9), ఇటలీలోని డ్యుమో డీ మిలానో (10) నిలిచాయి.
ఆసియా కట్టడాలతో విడుదల చేసిన మరో జాబితాలో తాజ్‌మహల్ రెండో స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







