జర్మన్లపై డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
- May 27, 2017
ఐరోపా కూటమి నేతలతో జరిపిన భేటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ జర్మనీపైన, అమెరికాలో జర్మన్ కార్ల విక్రయాలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు జర్మన్ పత్రిక డెర్ స్పీజెల్ తన ఆన్‌లైన్ ఎడిషన్‌లో వెల్లడించింది. ఐరోపా కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్, ఐరోపా కూటమి మండలి ఛైర్మన్ డొనాల్డ్ టస్క్ తదితర సీనియర్ అధికారులతో బ్రస్సెల్స్‌లో జరిపిన భేటీలో ట్రంప్ మాట్లాడుతూ 'జర్మన్లు చాలా చాలా చెడ్డ వార'ని (జర్మన్స్ ఆర్ బ్యాడ్, వెరీ బ్యాడ్) వ్యాఖ్యానించినట్లు ఈ పత్రిక తన కథనంలో పేర్కొంది. 'అమెరికాలో వారు (జర్మన్లు) లక్షలాది కార్లను విక్రయించుకుంటున్నారు. ఇది దారుణం. దీనిని నిలిపివేస్తాం' అని ట్రంప్ చెప్పినట్లు ఈ భేటీలో పాల్గొన్న వారిని ఉటంకిస్తూ పత్రిక వివరించింది. ఈ సందర్భంలో జంకర్ జోక్యం చేసుకుని జర్మనీని సమర్ధిస్తూ స్వేచ్ఛా వాణిజ్య ప్రయోజనాలు అందరికీ అందాల్సిన అవసరం వుందని ట్రంప్‌కు నచ్చచెప్పారని ఈ పత్రిక తెలిపింది. వాస్తవానికి జర్మన్ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, ట్రంప్‌లు శుక్రవారం నాడు ఇటలీలోని టోర్మీనా నగరంలో జరిగే జి7 సదస్సులో పరస్పరం భేటీ కావాల్సి వుంది. కాగా స్పీజెల్ పత్రిక కథనంపై ఇటు ఛాన్స్‌లర్ భవనం కానీ, అటు అమెరికా అధ్యక్ష భవనం కానీ ఏ విధంగానూ స్పందించలేదు. ట్రంప్ గత ఏడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో సైతం జర్మనీపైన, మెర్కెల్ పైన విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. గత మార్చిలో వాషింగ్టన్‌లో మెర్కెల్‌తో జరిగిన భేటీ 'గ్రేట్' అని వ్యాఖ్యానించిన ట్రంప్, ఆ మరునాడే జర్మనీకి వ్యతిరేకంగా విమర్శల దాడి ప్రారంభించారు.
నిషేధపు ఉత్తర్వులపై
స్టే కొనసాగింపు
ముస్లిం మెజారిటీ దేశాల నుండి అమెరికాకు జరిపే పర్యటనలపై నిషేధం విధించాలని అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులపై నిషేధం కొనసాగుతుందని అమెరికా కోర్టు పేర్కొంది. వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో ప్రధాన కేంద్రంగా పనిచేసే ఫోర్త్ సర్క్యూట్ అప్పీల్ కోర్టు ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. ఇరాన్, సిరియా, ఎమెన్, సోమాలియా, సూడాన్, లిబియా జాతీయులకు 90 రోజుల పాటు వీసా జారీని జాప్యం చేయాలని, ఇతర దేశాల శరణార్థులకు నాలుగు మాసాల పాటు వీసా జాప్యం చేయాలని ట్రంప్ ప్రభుత్వం కోరింది. అయితే ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఇది ముస్లింల పట్ల వివక్షపూరిత చర్యే కాగలదని పేర్కొంటూ దీని అమలును నిషేధించాలని కొన్ని గ్రూపులు చేసిన అభ్యర్ధనను మేరీలాండ్ న్యాయమూర్తి సమర్ధించారు. ఫోర్త్ సర్క్యూట్ కోర్టు కూడా దీన్ని అంగీకరించింది. తీవ్రవాద దాడులను నిలువరించేందుకు, జాతీయ భద్రతకు ఈ చర్య అమలు తప్పనిసరని ట్రంప్ పునరుద్ఘాటించారు. అయితే దీనివల్ల మరింత జాతీయ భద్రత వుంటుందనే భావనతో తాము ఏకీభవించలేకపోతున్నామని ఫోర్త్ సర్క్యూట్ కోర్టు పేర్కొంది. హవాయి న్యాయమూర్తి కూడా ఈ వాదనను సమర్ధించారు. నైన్త్ సర్క్యూట్ అప్పీల్ కోర్టులో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సవాలు చేయనుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







