600 కుటుంబాలకు ఆహార సాయం
- May 27, 2017
లయన్స్ క్లబ్ ఆఫ్ రిఫ్ఫా, రమదాన్ సందర్బంగా 600 కుటుంబాలకు ఫుడ్ ప్యాకెట్స్‌ని రెడ్ క్రిసెంట్ సొసైటీ ద్వారా అందించనుంది. మనామాలోని రెడ్ క్రిసెంట్ సొసైటీ - డిప్లమాటిక్ ఏరియాలో దీనికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ రిఫ్ఫా - డొనేషన్‌ని రెడ్ క్రిసెంట్ సొసైటీకి అందజేసింది. తదనంతరం రెడ్ క్రిసెంట్ సొసైటీ, బహ్రెయిన్‌లోని ఆయా కుటుంబాలకు వీటిని అందజేస్తుంది. గత 20 ఏళ్ళుగా పూర్ ఫ్యామిలీస్‌కి రిఫ్ఫా క్లబ్ పలు విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తోంది. సంస్థకు చెందిన సభ్యులు అందిస్తున్న వితరణ ద్వారా ఇది సాధ్యమవుతోంది. ఈ ఏడాది లయన్స్ క్లబ్ 7 టన్నులకు పైగా ఫుడ్ వాల్యూని అందించింది. వీటి విలువ 3000 బహ్రెయిన్ దినార్స్ కంటే ఎక్కువ. తమకు సోషల్ కమిటీ ఉందనీ, పూర్ ఫ్యామిలీస్‌ని స్టడీ చేసి, వారి అవసరాలకు తగ్గట్టుగా కొంతమేర వారిని ఆదుకునేందుకు సమాలోచనలు జరిపి, వారికి సాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







