వలసదారులకు క్షమాభిక్ష లేదు
- May 29, 2017
కువైట్:వీసా / రెసిడెన్సీ నిబంధనల్ని ఉల్లంఘించిన వలసదారులకు ఎలాంటి క్షమాభిక్ష లేదనీ, క్షమాభిక్షపై సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ వార్తల్ని నమ్మరాదని కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ క్షమాభిక్ష ప్రకటించిందనీ, వీసా, రెసిడెన్సీ ఉల్లంఘనులకు ఇదే మంచి అవకాశమని సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఇండియన్ కమ్యూనిటీ ఈ విషయాన్ని తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలనీ, ఎవరి ట్రాప్‌లోనూ పడరాదని ఇండియన్ ఎంబసీ విజ్ఞప్తి చేసింది. సుమారుగా 29,000 మంది భారత జాతీయులు, కువైట్‌లో వీసా, రెసిడెన్సీ ఉల్లంఘనల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వీరికి సాయం అందించేందుకు ఇండియన్ ఎంబసీ, లోకల్ అథారిటీస్‌తో కలిసి చర్యలు చేపడుతోంది. ఇంకో వైపున, కువైట్‌కి వచ్చేవారు, కువైట్‌లో ఉంటోన్న భారతీయులు ఖచ్చితంగా కువైటీ చట్టాలను, నిబంధనలను అనుసరించి నడుచుకోవాలని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







