అగ్నికి ఆహుతైన కారు
- May 29, 2017
దుబాయ్: దుబాయ్ - అల్ అయిన్ రోడ్‌పై సోమవారం, ఓ కారు అగ్నికీలల్లో చిక్కుకుంది. ఈ కారణంగా రోడ్డుపై ట్రాఫిక్‌కి తీవ్ర ఇబ్బందులో ఏర్పడ్డాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం అందలేదు. ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా దుబాయ్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియవలసి ఉంది. సాధారణంగా కార్లలో అక్రమంగా ఏర్పాటు చేసే ఎలక్ట్రానిక్ వైరింగ్ వల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ఫ్యూయల్ నింపేటప్పుడు ఇంజిన్‌ని ఆఫ్ చేయడం, కారులో స్మోకింగ్ చేయకపోవడం వంటి చర్యలతో ప్రమాదాలు నివారించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







