రమదాన్కి 300 డ్రోన్స్‌తో స్వాగతం
- May 29, 2017
జెడ్డా: జనరల్ అథారిటీ ఫర్ ఎంటర్టైన్మెంట్ (జిఇఎ), పవిత్ర రమదాన్ మాసానికి కొత్త తరహాలో స్వాగతం పలికింది. 300 డ్రోన్లకు అమర్చిన లైట్స్ ద్వారా స్వాగతం పలకడం సరికొత్త అనుభూతి. ఆకాశంలో డ్రోన్లు ఎగురుతూ లైట్లు దర్శనమివ్వడంతో వీక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అరబిక్‌లో రమదాన్ శుభాకాంక్షల్ని పేర్కొంటూ డ్రోన్లను ఆకాశంలోకి పంపించారు. రంగు రంగుల లైట్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెనా రీజియన్‌లో ఇంతవరకు ఈ తరహా ప్రయత్నం ఎవరూ చేయలేదని నిర్వాహకులు తెలిపారు. కొత్తదనంతో కూడిన ఆలోచన చేసి కొత్తగా రమదాన్ శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ముందస్తుగానే తెలుసుకున్నప్పటికీ, ఈ స్థాయిలో కొత్తదనం ప్రదర్శిస్తారని అనుకోలదంటూ పలువురు సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంటర్టైన్మెంట్ అథారిటీ పవిత్ర రమదాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్నింటిని చేపట్టనుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







