విజయదశమికి మహేశ్ కథానాయకుడిగా 'స్పైడర్'
- May 29, 2017
మహేశ్ కథానాయకుడిగా ఎ.ఆర్. మురుగదాస్ రూపొందిస్తోన్న 'స్పైడర్' సినిమా విజయదశమికి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా మహేశ వెల్లడించారు. ''ఈ దసరాకి మీ వద్దకు 'స్పైడర్' వస్తోంది. దీనికి సంబంధించి మే 31 (కృష్ణ పుట్టినరోజు) సాయంత్రం ఐదు గంటలకు వచ్చే ఫస్ట్ టీజర్‌తో పార్టీ మొదలవుతుంది'' అని ఆయన ట్వీట్ చేశారు. రకుల్‌ప్రీత్ సింగ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లియో ప్రొడక్షన్స్, ఎన్వీఆర్ సినిమా పతాకాలపై ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య ప్రతినాయక పాత్రను పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తయారవుతున్న ఈ చిత్రంలో మహేశ్ ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. మురుగదాస్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్లు ఒక కాన్సెప్ట్ తో కనిపిస్తాయి. అదే తరహాలో ఈ సినిమాలోనూ యాక్షన్ పార్టులను చాలా శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నారు మురుగదాస్. ఈ చిత్రానికి పీటర్ హెయిన్స్, కణల్ కణ్ణన్, అన్బరివ్ ('కబాలి' ఫేమ్) యాక్షన్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. హారిస్ జయరాజ్ స్వరాలు కూరుస్తున్నారు.
తాజా వార్తలు
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!







